Vastu

వాస్తు అవగాహన

వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలనుకున్నప్పుడు మన పురాణ ఇతిహాసాలలో కొన్ని ఘట్టాలు కూడా పరిదిలోకి తీసుకోవాలి . పురాణ ఘట్టాలను ఆధారంగా చేసుకొని వాస్తు శాస్త్రంలో కొన్ని విషయాలు సంతరించుకొని ఉన్నాయని అనటంలో సందేహం లేదు .అందుచే వాస్తు సిద్దాంతం , వైదిక ధర్మములు , ఆచారములు , ఖగోళ శాస్త్రం , పురాణాలపై వాస్తు శాస్త్రజ్ఞులకు అవగాహన కలిగి ఉండాలి . వైదిక ధర్మాలు తెలిసిన వాళ్ళు తూర్పు , దక్షిన సింహద్వారం ఇళ్ళకు ఆగ్నేయంలో వంట గదిని ఒప్పుకోరు . వైద్యం ఖగోళం తెలిసిన వారు నైరుతిలో కిటికీలు ఉంచకపోతే ప్పుకోరు . పురాణాలమీద అవగాహన ఉన్నవారు వంటగదికి పై అంతస్తులలో లెట్రిన్ , బెడ్రూములు ఒప్పుకోరు . వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రాచీన వాస్తు శాస్త్రజ్ఞులు విస్వఖర్మ , మయుడు వాస్తుశాస్త్రాన్ని అందించారు .

  [1] వైదిక సాంప్రదాయం – గృహ నిర్మాణం : వైదిక సాంప్రదాయక ప్రకారము   ఉత్తరపూర్వ దేసౌగార స్యోత్తర యాగ్నిం ప్రతిష్టాపయతి  అని ఉన్నది . అంటే పూజార్హమైన అగ్నిని ఈశాన్యంలో ప్రతిష్టించాలి అని అర్ధం . అలాంటప్పుడు ప్రతుత సమాజం లో ఊహిస్తున్నట్లు ఈశాన్యం లో ద్వారముంచటం కరెక్టా ? కాదు అందుకే ప్రాచీన వాస్తు ఈశాన్య ద్వారం ఒప్పుకోరు .

[2] ఆచారం – గృహ నిర్మాణం : ఆచారం విషయానికి వొస్తే ఇంటిలోకి రాగానే వంటగది , పూజగది కనపడ కూడదు . ఇవి రెండు వీలైనంత గోప్యంగా ఉండాలి . ఆగ్నేయంలో వంటగది ఏర్పరచుకోమని చెప్పారు కదా అని నేటి వాస్తు సిద్దంతులు తూర్పు , దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్ళకు ఆగ్నేయంలో వంట గది కడితే ఇంటిలోకి రాగానే వంట గది కనపడుతుంది . అడదిసమంజసం కాదు .

ఇంట్లో లెట్రిన్ వాస్తు సమ్మతమా ? దేవుడు , లెట్రిన్ ఒకేకప్పుక్రింద ఉండవచ్చా ? ఇది ఎంతవరకు సమంజసం ? ఇదిపనికి రాదనేదే ఆచారం .

[౩]  వైద్య శాస్త్రం ప్రకారం ఇంటిలోని చెడు సుక్ష్మ క్రిములు పోవాలి అంటే సూర్య రశ్మి ఇంటిలోకి రావాలి . పగలు 12 గంటల తరువాత ప్రతిగదిలోకి వెలుతురు రావాలి అంటే ప్రతి గదికి నైరుతిలో కిటికీ ఉండి  తీరాలి . అందుకేనేమో ఎకశీతి పద మండల వాస్తు ప్రకారం పూర్వం వారు ప్రతి గదికి నైరుతిలో కిటికీ లేదా ద్వారం ఉంచేవారు . నేటి సిద్దాతులు అవి మూయిస్తున్నారు . ఖగోళం ప్రకారం మన భారత దేశం లో సూర్య గమనం ద్యాహ్నం 12 గంటల తరువాత నైరుతి దిశగా ఉంటుంది . సరిగా గమనించండి ఇది గమనించి వాస్తుకి ఖగోళం ముడి పెట్టి వైద్యానికి అనుకూలమైన గృహాన్ని నిర్మించుకోండి . ప్రాచీన వాస్తు ఖగోళాన్ని వైద్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉంది .

     [4] భారతీయ సంస్కృతి లోని వాస్తు శాస్త్రాన్ని నమ్మితే మన పురాణాలను నమ్మి తీరాలి . రామాయణం లోని ఒక కధ ఆదారంగా కొన్ని వాస్తు విషయాలు పరిశీలిద్దాం . ఒకసారి దశరధుడు స్వర్గం నుండి ఆకాశ మార్గంలో తన దేశానికి వస్తున్నాడు . ఆయన అధిరోహించిన రధం బహుము మీద ఉన్న ధాన్య రాసి మీదుగా ప్రయాణం చేసింది . తనమీదుగా ప్రయాణం చేసినందుకు అన్నపూర్ణా దేవి ఆగ్రహించి ధశరదుని రాజ్యంలో పంటలు పండ కుండా చేసింది . అలాంటపుడు వంట గదిమీద సంసారుల యొక్క బెడ్ రూమ్ సమంజసమా ? కాదు . ధాన్య రాశి నిలవ ఉండేది వంట గదిలోనే . అందువలన అలాంటి ప్రతి బందకాలు రాకుండా ఉండాలి అనే ఉద్దేశం తోనే మన ప్రాచీనులు క్రింద అంతస్తు మాదిరిగానే పైంతస్తులు కూడా నిర్మించేవారు . వంటగది మీద లెట్రిన్ పడక గది నిషేదించారు .

    ఈవిదంగా పలు రకాల శాస్త్రాలను ఆధారం చేసుకొని మనకు విశ్వఖర్మ  , మయుడు , వరాహ మిహిరులు వాస్తు శాస్త్రాన్ని అందించారు . ఆ ప్రాచీన శాస్త్రాని చదివి , దానిద్వారా ఇల్లు నిర్మించుకుంటే సుఖ సౌక్యాలు కలుగుతాయి . వాస్తుశాస్త్రమే కరక్ట్ మిగతా ధర్మాలు పట్టించు కొనక్కరలేదు అంటే కుదరదు . వస్తు శాస్త్రం ఇతర శాస్త్రాలను ఆధారం చేసుకొని ఉన్నది .

ప్రశ్న– ఒక వ్యక్తి తన పేరు మీద ఆయము నిర్ణయించి గృహ నిర్మాణము చేయకుంటే ఆ ఇల్లు తర్వాత తరాలకు గాని , కొనుక్కున్న వారికీ గాని సరిపోతుందా ,

ఈ మద్య కాలం లో చాల మంది అడుగుతున్న ప్రశ్న . ప్రశ్న మంచిదే కాని ఇందులో అవగాహన లోపం చాలా  ఉన్నది అనుటలో సందేహం లేదు . ఫలానా ఆయము ఫలానా వారికి సరిపోతుంది అనిగాని సరిపోదు అనిగాని ఉన్నదా ? పాటకులు విజ్ఞతతో దీన్ని గమనించి హేతువాదమును ప్రాచీన వస్తు మీదకు తీసుకు రావద్దన్నది నా విజ్ఞప్తి  . ఆయము దిక్కుకు సింహాద్వారమునకు కాని మనిషికి కాదు . మరియు మనిషికి కాదు . యజమాని నక్షత్రము నాకు గణన చేయుట దేనికి అనగా ఆ ఇంటి సంకుస్తాపన చేయువాడు ఒక్కడే కావున అతడి నక్షత్రానికి చూడడం . ఇల్లు ఒకవేళ 100 చేతులు మారినా సంకుస్తాపన చేసిన వాడే మొదటి యజమాని . మారిన ప్రతి యజమాని సంకుస్తాపన చెయ్యడు . కావున మొదటి శంకుస్తాపన చేసే యజమానికి సరిపడే నక్షత్రం తో కూడుకున్న ఆయం చూడడం ఆచారము . ఇది కూడా తరువాత తరాల వారికీ సంబంధం లేదు ధనం ఋణం కూడా ఇంటివే . కానీ యజమానివి కావు . అని గమనించ గలరు . సంస్కృతితో – సంస్కృతం తో – శాస్త్రాద్యనం చెయ్యడము విశేషం .అలా అద్యయనం చేసిన యడల ఇటువంటి అనుమానాలు , దోషాలు రాకుండా ఉంటాయి .

ప్రశ్న – మానవుని ప్రశాంత జీవనానికి వాస్తు శాస్త్రమే ప్రదాన కారణమా ?

అదొక కారణం . అదే మూలం కాదు . మానవుని ప్రశాంత జీవనానికి అనేక మార్గాలు శాస్త్ర రూపములో మనకు మహర్షులు అందించారు . వాటి లోనిదే ఈ వాస్తు శాస్త్రము . స్తానబలము కాని తన బలము కాదయ విశ్వదాభి రామ వినుర వేమా  వాస్తు, రత్న, వైద్య ,యోగా , వేదాంత మంత్రం ఇటువంటి అనేక రకాలయిన శాస్త్రాలు మానవుని ప్రశాంత జీవనానికి ఆదారమైనవి . ఈ పై శాస్త్రాలను దేనిని ఆచరించాలి అనినా మనం ఉండే ప్రదేశం శాస్త్ర బద్దమైనది అయి ఉండాలి . అందుకే మనం నివసించే ప్రదేశం వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి . జాతక రీత్యా మనకు ఆర్వణము  లేని రత్నాలు ధరించకూడదు . తద్వారా విరుద్దమైన ఫలితాలు వస్తాయి . ఇటువంటి వాటిని తెలుసుకొని నివారించటానికే రత్న శాస్త్రం ఉపయోగ పడుతుంది . వైద్య విదానములు పూర్తిగా తెలుసుకొని పూర్తిగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి .

ఉదా – యోగాబ్యాసము ద్వారా శరీరాన్ని , మనసుని అదుపులో ఉంచుకోవాలి .

  వేద్దాంత శాస్త్రములో చెప్పిన వాటిని అమలు చేసి కొంత ఉత్తమమైన జీవనానికి మార్గం వెతకాలి .

ఉదా – అత్యాశను విడనాడడం వంటివి వేదాంత శాస్త్రమే తెలియ జేస్తుంది . నేటి సమాజంలో వ్యక్తులు వృద్దాప్యము వచ్చినప్పుడు కుడా అమెరికాలో ఉండి సంపాదించే తన సంతతిని చూసి ఆనందిస్తారు . కాని వృద్దాప్యం లో తనకు సహాయ పడే కొడుకు లేడు అని  బాద పాడుతా లేదు . ఈ కాలం లో సంపాదన మీద అత్యాశ అంత పెరిగినది . తద్వారా చికాకులు పెరిగినవి .

మంత్రం శాస్త్ర రీత్యా మనకు ఇష్ట దైవారాధన చేసి మనలో ఒక విదమైన స్తిత ప్రజ్ఞత పెంచుకోవాలి .

  నియమ నిబందనలతో కూడిన జీవితాన్ని అమలు చేయడానికి వీలుగా మన మహర్షులు ప్రతి విషయాన్ని శాస్త్రాదారంగా రూపొందించారు . వాటి లోనివే ఈ వాస్తు , ఆయుర్వేద , రత్న , యోగ , మంత్ర యిత్యాది శాస్త్రాలు . వేటిని తప్పక గ్రహించాలి .

   ఇలాంటి అనేక రకములైన శాస్త్రములను మనం వాడుకొని ప్రశాంత జీవనాని పొందాలి .

   వాస్తు మనిషి జీవనం ప్రశాంతముగా ఉండుటకు ఉపయోగ పడుతుంది . మనిషి రాతను పూర్తిగా మార్చలేదు .

   వాస్తు శాస్త్రాన్ని వాడుకొని ప్రశాంత జీవనం పొందండి . అంతే కాని మన నిత్య జీవితంలో జరిగే అనుభవాలకు అన్నింటికీ వాస్తు మూలం అంటే తప్పు . ఒక ఇంట్లో అందరికి ఒకేసారి అనారోగ్యం ఉంటుందా? అందరు విద్యావంతులు అవుతారా ? గమనించండి దీనిని బట్టి వాస్తు తో పాటు ఇతర శాస్త్రాల ప్రభావం కూడా మానవుని ప్రశాంత జీవనానికి దోహదం చేస్తాయి . అన్నిటికంటే ముక్యమైనది అతని జాతకం . 

₹1,000 Add to cart

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *